logo

శీతల గాలులతో సతమతం

ఉత్తర భారతం వాయువ్య దిశ నుంచి దక్షిణం వైపు శీతల గాలులు భూమికి దగ్గరగా వీస్తుండడంతో జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. దీనికి తోడు చలిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పది రోజులుగా

Published : 27 Jan 2022 05:05 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం

ఉత్తర భారతం వాయువ్య దిశ నుంచి దక్షిణం వైపు శీతల గాలులు భూమికి దగ్గరగా వీస్తుండడంతో జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. దీనికి తోడు చలిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పది రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దాదాపు ఐదు డిగ్రీలు పడిపోయాయి. ఛత్తీస్‌గడ్‌, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రం వైపు శీతల గాలుల తీవ్రత ఎక్కువైందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని తీవ్రత మరో రెండ్రోజుల పాటు ఉంటుందని పేర్కొన్నారు. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల మధ్య తేడా పది డిగ్రీల మేర ఉండడం కూడా చలి తీవ్రతకు కారణమవుతోందని అధికారులు వివరించారు.

జలుబుతో జనం ఇబ్బంది

చలిగాలులు ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా జ్వరం, జలుబు, దగ్గుతో ఎక్కువ మంది బాధపడుతున్నట్లు ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. గాలిలో తేమ అధికంగా ఉండడంతో చిన్నారులు, బాలింతలు, దీర్ఘకాలిక రోగులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరోవైపు చలికి వరి పొలాలు సకాలంలో ఎదగడం లేదని రైతులు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని