logo

మొదలైన స్వమిత్వ సర్వే

దోమకొండలో సర్వే ఆఫ్‌ ఇండియా బృందం సభ్యులు గురువారం స్వమిత్వ సర్వే నిర్వహించారు. జీపీఎస్‌ ఆధారంగా డ్రోన్‌ సాయంతో గ్రామ ఉపరితల చిత్రాలు, వీడియోలు తీశారు. గ్రామ కంఠంలోని ఇళ్లు, ఇంటి స్థలాల చిత్రాలను డ్రోన్‌ కెమెరాతో

Published : 20 May 2022 03:10 IST

డ్రోన్‌ను పంపుతున్న కేంద్ర బృందం సభ్యులు

దోమకొండ, న్యూస్‌టుడే: దోమకొండలో సర్వే ఆఫ్‌ ఇండియా బృందం సభ్యులు గురువారం స్వమిత్వ సర్వే నిర్వహించారు. జీపీఎస్‌ ఆధారంగా డ్రోన్‌ సాయంతో గ్రామ ఉపరితల చిత్రాలు, వీడియోలు తీశారు. గ్రామ కంఠంలోని ఇళ్లు, ఇంటి స్థలాల చిత్రాలను డ్రోన్‌ కెమెరాతో తీశారు. గ్రామంలోని ఇళ్లు, ఇంటి స్థలాల పటాన్ని నమోదు చేస్తామని బృందం సభ్యులు తెలిపారు. ఆ పటాన్ని గ్రామ కార్యదర్శికి అందజేస్తే ఇంటింటి సర్వేతో కొలతలు చేసి రికార్డులో నమోదు చేస్తారని తెలిపారు. స్వమిత్వ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో గోధుమకుంట(మేడ్చల్‌), సరస్వతీగూడ (రంగారెడ్డి), స్టేషన్‌ఘన్‌పూర్‌ (జనగాం), దోమకొండ(కామారెడ్డి), హర్ల(ఆదిలాబాద్‌)లను ఎంపిక చేశామని తెలిపారు. ఇంటింటా సర్వే పూర్తయిన తరువాత యజమానికి స్వమిత్వకార్డు అందిస్తారన్నారు. కార్యక్రమంలో బృంద సభ్యులు, సర్వేయర్లు శాంతి భూషణ్‌రావు, గోపాల్‌రావు, ఎంపీపీ శారద, జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్‌, సర్పంచి నల్లపు అంజలి తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని