logo

ఎంపీపీల నుంచి ఎమ్మెల్యేలుగా..

ఉమ్మడి జిల్లాలో ఎంపీపీలుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యేలుగా ఎదిగిన వారు ఇద్దరు ఉన్నారు. మండల ప్రజాపరిషత్‌ వ్యవస్థ ఆవిర్భవించిన తొలినాళ్లలో మండల పరిషత్‌ అధ్యక్షుడి(ఎంపీపీ) ఎన్నికలను నేరుగా ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించేవారు.

Updated : 26 Oct 2023 05:22 IST

ఉమ్మడి జిల్లాలో ఇద్దరికి¨ అవకాశం
న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

ఉమ్మడి జిల్లాలో ఎంపీపీలుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యేలుగా ఎదిగిన వారు ఇద్దరు ఉన్నారు. మండల ప్రజాపరిషత్‌ వ్యవస్థ ఆవిర్భవించిన తొలినాళ్లలో మండల పరిషత్‌ అధ్యక్షుడి(ఎంపీపీ) ఎన్నికలను నేరుగా ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించేవారు. ఇలా 1987 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి మండలం నుంచి తెదేపా నేత సయ్యద్‌ యూసూఫ్‌అలీ విజయం సాధించాడు. అదే సంవత్సరం మాచారెడ్డి ఎంపీపీ పదవి కోసం కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో దిగిన ప్రస్తుత మాజీ మంత్రి షబ్బీర్‌అలీ తెదేపా అభ్యర్థి చేతిలో ఓటమి చెందాడు. అదే షబ్బీర్‌అలీకి తొలి ఓటమి. ఈ ఎన్నికలు పూర్తయ్యాక 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి ఎంపీపీ యూసూఫ్‌అలీ తెదేపా నుంచి షబ్బీర్‌అలీ కాంగ్రెస్‌ అభ్యర్థులుగా తలపడ్డారు. ఈ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులుగా చేస్తూ షబ్బీర్‌అలీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. 1999లో కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసిన సయ్యద్‌ యూసూఫ్‌అలీ గెలుపొందారు.

సిరికొండ ఎంపీపీగా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన బాజిరెడ్డి గోవర్ధన్‌ 1994 ఎన్నికల్లో ఆర్మూర్‌ నుంచి అన్నపూర్ణమ్మ చేతిలో ఓటమి చెందారు. తర్వాత 1999 ఎన్నికల్లో ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యేగా, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేగా రెండుమార్లు విజయంసాధించిన గోవర్ధన్‌ ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ ఇద్దరు నేతల రాజకీయ ప్రస్థానం ఎంపీపీగా ప్రారంభమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని