logo

చివరి ప్రయత్నంలో సివిల్స్‌

ఐదు సార్లు సివిల్స్‌ పరీక్ష రాసినా ఆశించిన ఫలితం రాలేదు. నిరాశ చెందకుండా ఆరో ప్రయత్నంలో విజయం సాధించారు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండకు చెందిన రామారెడ్డిపేట రజనీకాంత్‌.

Updated : 17 Apr 2024 06:19 IST

కామారెడ్డి జిల్లావాసి రజనీకాంత్‌కు 587వ ర్యాంకు 

ఈనాడు, కామారెడ్డి: ఐదు సార్లు సివిల్స్‌ పరీక్ష రాసినా ఆశించిన ఫలితం రాలేదు. నిరాశ చెందకుండా ఆరో ప్రయత్నంలో విజయం సాధించారు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండకు చెందిన రామారెడ్డిపేట రజనీకాంత్‌. యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్‌ తుది ఫలితాల్లో అతడు 587వ ర్యాంకు సాధించారు. బాల్యం నుంచి రజనీకాంత్‌ చదువులో చురుకుగా ఉండేవారు. అతడు నిర్దేశించుకున్న ఉన్నత లక్ష్యం సాధించేందుకు అవసరమైన తోడ్పాటును తల్లిదండ్రులు సిద్దిరాములు, పద్మ అందించారు. పాఠశాల విద్యను కామారెడ్డి జిల్లాలో పూర్తిచేసిన రజనీకాంత్‌ ఇంటర్‌ను ఏపీఆర్‌జేసీ నాగార్జున సాగర్‌లో అభ్యసించారు. దిల్లీలోని ఎస్వీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. దిల్లీలోనే పీజీ పూర్తిచేశారు.

మూడు సార్లు మెయిన్స్‌కు అర్హత

ఆరుసార్లు సివిల్స్‌ పరీక్ష రాసిన రజనీకాంత్‌ మూడు సార్లు మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. చివరి ప్రయత్నంలో మంచి ఫలితం సాధించాడు. గ్రామీణ ప్రాంతానికి చెందిన అతడి తల్లిదండ్రులు వ్యాపారరీత్యా కామారెడ్డి పట్టణంలోని కల్కీనగర్‌లో స్థిరపడ్డారు.

సమాజ సేవ చేయాలనే లక్ష్యం నెరవేరింది : రజనీకాంత్‌

చిన్నప్పటి నుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్‌ను ఎంచుకున్నాను. డిగ్రీ చివరి సంవత్సరం నుంచే ప్రిపరేషన్‌ ప్రారంభించాను. ఆరో ప్రయత్నంలో ర్యాంకు సాధించాను. మొదటి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణత సాధించాను. నిరాశ చెందకుండా సివిల్స్‌ సాధించాలనే తపనతో చివరి వరకు ప్రయత్నించి సఫలమయ్యాను. ఇందుకు నా తల్లిదండ్రులు వెన్నంటే ఉండి ప్రోత్సహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని