logo

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు

ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు యువకులకు గాయాలైన ఘటన రూరల్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

Published : 18 Apr 2024 04:56 IST

ఒకరి దుర్మరణం, ఇద్దరికి గాయాలు

నిజామాబాద్‌ గ్రామీణం : ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు యువకులకు గాయాలైన ఘటన రూరల్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఠాణా ఎస్సై మహేష్‌ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గౌతమ్‌నగర్‌కు చెందిన ధమాపాల్‌ గౌతమ్‌(33), ఉమాకాంత్‌, వినోద్‌లు మంగళవారం బైపాస్‌ రోడ్డు నుంచి శ్మశానవాటిక రోడ్డు వైపు వెళ్తుండగా.. అర్సపల్లి నుంచి కంఠేశ్వర్‌ వైపు వెళ్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. కిందపడిన ధమాపాల్‌ గౌతమ్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. ఉమాకాంత్‌, వినోద్‌లు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గౌతమ్‌ తండ్రి నార్వాడే గౌతమ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


అదృశ్యమై దొరికిన ఇద్దరు విద్యార్థినులు

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: కామారెడ్డి బాలసదనంలో ఉంటున్న ఇద్దరు అనాథ విద్యార్థినులు అదృశ్యమై నాలుగు రోజుల తర్వాత దొరికినట్లు బాలసదనం సూపరింటెండెంట్‌ తెలిపారు. పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రంలోని హరిజనవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఈ నెల 13న పాఠశాలకు వెళ్లి తిరిగి బాలసదనానికి చేరుకోలేదు. విద్యార్థినుల కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. ఆందోళనకు గురైన బాలసదనం ఇన్‌ఛార్జి గంగుబాయి బుధవారం ఉదయం కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తును ప్రారంభించారు. రాత్రి రైల్వేస్టేషన్‌ సమీపంలో విద్యార్థినులిద్దరూ ఉన్నట్లు తెలుసుకున్న బాలసదనం అధికారులు వారిని పట్టుకున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని