logo

నామపత్రాల దాఖలుకు వేళాయె

పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Updated : 18 Apr 2024 05:15 IST

జహీరాబాద్‌ స్థానానికి సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏర్పా
ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంట్లున్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం

పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారిగా సంగారెడ్డి కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఉండటంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సంగారెడ్డిలోనే ఉంటుంది. సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, మాధురి, డీఆర్వో పద్మజారాణి, కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డితో మరో నలుగురు ఆర్డీవోలు వ్యవహరిస్తారు. నామినేషన్ల స్వీకరణ మొదలు.. ఫలితాల వెల్లడి వరకు వీరు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.

సీసీ కెమెరాలతో నిఘా

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25 తుది గడువు. కలెక్టరేట్‌ ప్రధాన గేటు నుంచే సీసీ కెమెరా నిఘా ప్రారంభమవుతుంది. నామినేషన్‌ దాఖలు చేసి తిరిగి వెళ్లేవరకు అభ్యర్థులు, వారి వెంట వచ్చిన అనుచరుల కదలికల్ని సీసీ కెమెరాలతో పరిశీలిస్తారు. ఇందుకోసం 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. డిపాజిట్‌ కింద జనరల్‌ అభ్యర్థులైతే రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.12,500 చెల్లించాలి.

సందేహాల నివృత్తికి హెల్ప్‌ డెస్క్‌

అభ్యర్థులు సరైన పద్ధతిలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే తిరస్కరణకు గురవుతాయి. పోటీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో నామినేషన్ల హెల్ప్‌ డెస్క్‌ను సైతం ఏర్పాటు చేశారు. సందేహాలను హెల్ప్‌ డెస్క్‌ సిబ్బంది నివృత్తి చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని