logo

యూఎల్‌సీ నోటీసుల పర్వం ఆగని

నగరంలో పట్టణ భూ గరిష్ఠ పరిమితి (యూఎల్‌సీ) చట్టం కింద స్వాధీనం చేసుకున్న భూముల్లో వెలిసిన కట్టడాలు, ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ అంశంపై అధికారులు దృష్టిసారించారు. గత కొన్ని నెలలుగా ఈ ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో జిల్లా అధికారులకు తగు ఆదేశాలిస్తున్నారు.

Updated : 24 May 2022 05:48 IST

  క్రమబద్ధీకరణ రుసుంలపై అధికారుల దృష్టి

-న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

నగరంలో పట్టణ భూ గరిష్ఠ పరిమితి (యూఎల్‌సీ) చట్టం కింద స్వాధీనం చేసుకున్న భూముల్లో వెలిసిన కట్టడాలు, ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ అంశంపై అధికారులు దృష్టిసారించారు. గత కొన్ని నెలలుగా ఈ ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో జిల్లా అధికారులకు తగు ఆదేశాలిస్తున్నారు.

లాగైనా క్రమబద్ధీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని, జూన్‌ నెల నుంచి రుసుములు చెల్లించేలా ఆక్రమణదారులపై ఒత్తిడి పెంచాలని స్పష్టం చేసినట్లు సమాచారం. నోటీసుల జారీ పురోగతిపై సీసీఎల్‌ఏ కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు కోరుతున్నారు.

86 హెక్టార్లలో 3025 కట్టడాలు: యూఎల్‌సీ చట్టం ప్రకారం జీవీఎంసీ పరిధిలోని భూస్వాముల నుంచి గతంలో దాదాపు 186 హెక్టార్ల వరకు స్వాధీనం చేసుకున్నారు. అందులో వంద హెక్టార్ల భూ వ్యవహారాలు ఇంకా తేలలేదు. మూడు నెలల క్రితం నిర్వహించిన సర్వేలో 86 హెక్టార్లలో 3025 కట్టడాలున్నట్లు గుర్తించారు. నివాసితులకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ చేపట్టారు. ఆయా భూములు మహారాణిపేట, సీతమ్మధార, గాజువాక, గోపాలపట్నం, విశాఖపట్నం రూరల్‌ మండలాల పరిధిలో ఉన్నాయి.


ఇంత వరకు 75 చదరపు అడుగుల లోపు ఆక్రమణదారులు 701 మందికి, 150 చదరపు అడుగుల లోపు 335 మందికి, 300 చదరపు అడుగుల లోపు 461 మందికి, 300 చదరపు అడుగులు పైబడిన 86 మందికి చొప్పున 1583 మందికి నోటీసులు ఇచ్చారు. వీరంతా 35 హెక్టార్లలో ఉన్నారు. మిగిలిన భూముల్లో ఉన్న 1442 మందికి నోటీసులు జారీ చేయవల్సి ఉంది. నోటీసులు ఇచ్చేందుకు వెళుతున్న తహసిల్దార్‌ కార్యాలయ ఉద్యోగులకు ఆక్రమణదారులు సహకరించడం లేదు.


మూడు రెట్లు ఎలా చెల్లించాలి?..

‘పూర్వీకుల నుంచి ఇక్కడ నివసిస్తున్నాం.. రిజిస్ట్రేషన్లు సైతం అయ్యాయి. ఇప్పుడు డబ్బులు కట్టి క్రమబద్ధీకరించుకోవడం ఏమిట’ని నివాసితులు ప్రశ్నిస్తున్నారు.

ఉదాహరణకు సీతంపేటలో చదరపు గజం రిజిస్ట్రేషన్‌ విలువ రూ.50వేలు ఉంటే దానికి మూడు రెట్లు రూ.1.50లక్షలు చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు నోటీసుల్లో పేర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్‌లో సైతం ఆ ధర పలకడం లేదని, తాము ఏరకంగా అంత డబ్బు చెల్లించగలమని ఆక్రమణదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంగానే నోటీసుల జారీ ప్రక్రియ మందగించింది. సీసీఎల్‌ఏ కార్యాలయ అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఎలాగైనా క్రమబద్ధీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు సీసీఎల్‌ఏ కార్యాలయ అధికారులు వివరాలను ఆరా తీస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని