logo

Balakrishna: ట్రాఫిక్‌లో చిక్కుకున్న బాలకృష్ణ

యువగళం విజయోత్సవ సభ ‘నవశకం’ కార్యక్రమానికి వెళ్తున్న ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.

Updated : 21 Dec 2023 07:27 IST

కారులో బాలకృష్ణతో తెదేపా నాయకులు జనపాల రాము

పరవాడ, న్యూస్‌టుడే: యువగళం విజయోత్సవ సభ ‘నవశకం’ కార్యక్రమానికి వెళ్తున్న ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో అనకాపల్లి జిల్లా పరవాడకు చెందిన తెదేపా నాయకులు అట్టా సన్యాసిఅప్పారావు, జనపాల రాము వారి కారులో బాలకృష్ణను వీఐపీ గేటు వద్దకు తీసుకెళ్లి దించారు. దీనికి సంబంధించి వారు వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ ఎయిర్‌ పోర్టు నుంచి పోలిపల్లిలోని సభా వేదిక వద్దకు బాలకృష్ణ కారులో బయలుదేరారు. వేదికకు సుమారు కిలోమీటరు దూరంలోని జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అదే సమయంలో పరవాడ తెదేపా నాయకులు సన్యాసిఅప్పారావు, రాము ప్రధాన రహదారి గుండా వెళ్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వీరి కారు ఆపి బాలకృష్ణను వీఐపీ గేటు వద్దకు తీసుకెళ్లి దింపమని అడిగారు. బాలకృష్ణతో పాటు అతను ఇద్దరు పీఏలను వారి కారులో ఎక్కించుకుని వీఐపీ గేటు వద్ద దించారు. బాలకృష్ణ అక్కడి నుంచి వేరే కారులో సభా వేదిక వద్దకు వెళ్లారు. కారులో ప్రయాణించిన సమయంలో మీది ఏ నియోజకవర్గం అని అడగడంతో పెందుర్తి అని చెప్పామని, ఎప్పుడైనా హైదరాబాద్‌ వచ్చినప్పుడు తనను కలవాలని పెందుర్తి యువగళం రథ సారధి అని చెబితే తనవద్దకు పంపిస్తారని బాలకృష్ణ చెప్పినట్లు వారు తెలిపారు.

అట్టా సన్యాసిఅప్పారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని