logo

కాంగ్రెస్‌ విశాఖ ఎంపీ అభ్యర్థిగా సినీ నిర్మాత

కాంగ్రెస్‌ పార్టీ తరఫున శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి  వేణుగోపాల్‌ ప్రకటించారు.

Published : 10 Apr 2024 06:03 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: కాంగ్రెస్‌ పార్టీ తరఫున శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి  వేణుగోపాల్‌ ప్రకటించారు. విశాఖ ఎంపీ స్థానంతోపాటు భీమిలి, దక్షిణం, గాజువాక అభ్యర్థులను ప్రకటించారు. ఎంపీ స్థానాన్ని సినీ నిర్మాత పులుసు సత్యనారాయణ రెడ్డి (సత్యా రెడ్డి)కి కేటాయించారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా. విశాఖలో స్థిరపడ్డారు. తెలుగు సేన పార్టీని స్థాపించి.. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఆయన ఇప్పటివరకు ఉద్యమ నేపథ్యమున్న 53 సినిమాలు నిర్మించారు. ఉక్కు నిర్వాసితులతో దిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేపట్టారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా చిత్రీకరించారు. అందులో స్టీల్‌ప్లాంట్ ఉద్యమనేతగా, కథానాయకుడి పాత్ర పోషించడంతోపాటు ఆ సినిమాకు నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు వహించారు. అందులో ప్రజా గాయకుడు, దివంగత గద్దర్‌ కూడా నటించారు.


కాంగ్రెస్‌ అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా వేగి

నెహ్రూచౌక్‌ (అనకాపల్లి), న్యూస్‌టుడే: అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా వేగి వెంకటేశ్‌ను కాంగ్రెస్‌ రంగంలోకి దింపింది. ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ పార్టీ కమిటీ సభ్యుడిగా, పీసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈయన తండ్రి బాబూరావు కాంగ్రెస్‌లో పనిచేశారు. పార్టీకి వీరు చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని వెంకటేశ్‌ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని