logo

మహిళాభ్యున్నతికి కృషి

కూటమి ప్రభుత్వం రాగానే మహిళల అభ్యున్నతికి కృషి చేస్తామని అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. గొలగాం ఎల్లారమ్మకాలనీలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా గర్జనకు భారీగా మహిళలు తరలివచ్చారు.

Published : 16 Apr 2024 04:08 IST

మాట్లాడుతున్న కొణతాల రామకృష్ణ

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం రాగానే మహిళల అభ్యున్నతికి కృషి చేస్తామని అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. గొలగాం ఎల్లారమ్మకాలనీలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా గర్జనకు భారీగా మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ వైకాపా ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు మూడు గ్యాస్‌ సిలెండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. మహిళలకు ఉపాధి కల్పనలో భాగంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో గాజు గ్లాసు, కమలం గుర్తులపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. సీఎం రమేశ్‌ తనయుడు రుత్విక్‌, తెదేపా, జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని