logo

నిరుద్యోగ యువతకు ఉపాధి చూపుతాం

ఐటీ కారిడార్‌ ప్రాజెక్టులొచ్చేలా, పారిశ్రామిక అభివృద్ధి సాకారమయ్యేలా పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ చొరవ తీసుకుని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చూపుతారని ఆయన కోడలు పూజా పేర్కొన్నారు.

Updated : 16 Apr 2024 05:17 IST

ప్రచారంలో సీఎం రమేశ్‌ కోడలు పూజా, భాజపా నాయకులు

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: ఐటీ కారిడార్‌ ప్రాజెక్టులొచ్చేలా, పారిశ్రామిక అభివృద్ధి సాకారమయ్యేలా పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ చొరవ తీసుకుని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చూపుతారని ఆయన కోడలు పూజా పేర్కొన్నారు. నర్సీపట్నంలోని ఐదు, ఆరు వార్డులు, ధర్మసాగరం ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి, అన్ని నియోజకవర్గాల్లో విశాలమైన రోడ్ల నిర్మాణం, చెరకు, వరికి మద్దతు ధర లభించేలా కృషి చేస్తారన్నారు. భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి సారథి, నాయకులు కాళ్ల సుబ్బారావు, శివ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని