logo

బూడితో విభేదాలు.. ఎంపీపీ పదవికి రాజీనామా

దేవరాపల్లి ఎంపీపీ పదవికి వైకాపా నాయకురాలు కిలపర్తి రాజేశ్వరి రాజీనామా చేశారు. జడ్పీ సీఈఓ పోలినాయుడుకు రాజీనామా పత్రాన్ని భర్త, వైకాపా జిల్లా ఉపాధ్యక్షుడు కిలపర్తి భాస్కరరావుతో కలిసి సోమవారం మధ్యాహ్నం అందజేశారు.

Updated : 16 Apr 2024 05:15 IST

జడ్పీ సీఈఓ పోలినాయుడుకి రాజీనామా పత్రం అందజేస్తున్న ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, భాస్కరరావు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: దేవరాపల్లి ఎంపీపీ పదవికి వైకాపా నాయకురాలు కిలపర్తి రాజేశ్వరి రాజీనామా చేశారు. జడ్పీ సీఈఓ పోలినాయుడుకు రాజీనామా పత్రాన్ని భర్త, వైకాపా జిల్లా ఉపాధ్యక్షుడు కిలపర్తి భాస్కరరావుతో కలిసి సోమవారం మధ్యాహ్నం అందజేశారు. వ్యక్తిగత కారణాలతోపాటు అనారోగ్యం దృష్ట్యా పదవికి రాజీనామా చేసినట్లు ఆమె చెప్పారు. వైకాపా సభ్యత్వానికి, ఎంపీటీసీ స్థానానికి రాజీనామా చేయలేదన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఎంపీపీ పదవిని ఎలా భర్తీ చేయాలో కలెక్టరుతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని జడ్పీ సీఈఓ పేర్కొన్నారు. మాడుగుల అసెంబ్లీ వైకాపా అభ్యర్థిగా ఈర్లె అనూరాధ పేరు ప్రకటించినప్పటి నుంచి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, వైకాపా జిల్లా ఉపాధ్యక్షుడు కిలపర్తి భాస్కరరావు మధ్య విభేదాలు మొదలయ్యాయి. దేవరాపల్లిలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన వైకాపా సమావేశానికి భాస్కరరావుతోపాటు ఆయన వర్గీయులు హాజరు కాలేదు. ఈ సమావేశంలో ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. భాస్కరరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తెకు టికెట్‌ రావడాన్ని జీర్ణించుకోలేక ఎన్నికల్లో సహకరించేందుకు కిలపర్తి ఇష్టపడడటం లేదని తనకు తెలుసని పేర్కొన్నారు. ఆయనతో కలిసి ఇకపై రాజకీయం చేయకూడదని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే భాస్కరరావు తన భార్యతో ఎంపీపీ పదవికి రాజీనామా చేయించారన్న ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు