logo

కనీస వేతనం రూ.36 వేలు చెల్లించాల్సిందే

అదానీ గంగవరం పోర్టు (ఏజీపీ) నిర్వాసిత కార్మికులకు కనీస వేతనం రూ.36 వేలు చెల్లించాలని పలువురు డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు చేపట్టిన ఆందోళనలో భాగంగా సోమవారం

Updated : 16 Apr 2024 05:20 IST

ఏజీపీ గేటు వద్ద కార్మిక కుటుంబాల నిరసన

నిరసనలో పాల్గొన్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులు

గాజువాక, న్యూస్‌టుడే : అదానీ గంగవరం పోర్టు (ఏజీపీ) నిర్వాసిత కార్మికులకు కనీస వేతనం రూ.36 వేలు చెల్లించాలని పలువురు డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు చేపట్టిన ఆందోళనలో భాగంగా సోమవారం పోర్టు గేటు వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గత కొన్ని రోజులుగా విధులు బహిష్కరించి వేతనాల కోసం డిమాండ్‌ చేస్తున్నా... యాజమాన్యం  పట్టించుకోవడం లేదని, న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తామని యూనియన్‌ నాయకులు హెచ్చరించారు. విశాఖ పోర్టులో మాదిరిగా వేతనాలు చెల్లించి, కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని కోరారు. కార్మికులు, వారి కుటుంబీకులు భారీగా హాజరవడంతో న్యూపోర్టు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. పోలీసు ఆంక్షలు అమల్లో ఉన్నాయని, కార్మికులు సహకరించాలని సూచించారు.

ఆందోళన నేపథ్యంలో కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో.... విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు బొగ్గు తీసుకొచ్చిన నౌక నుంచి సరకు దిగుమతి చేసే వీల్లేక, అది వెనక్కి వెళ్లిపోయిందని కార్మిక నాయకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు