logo

దువ్వకొండపై అక్రమార్కుల కన్ను

పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురం గ్రామ రెవెన్యూ పరిధిలోని దువ్వకొండ వద్ద  గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడలేదు. ఈ కొండ వద్ద పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ అండతో ఓ వైకాపా నాయకుడు అక్రమంగా మట్టి, రాళ్లు తవ్వకాలు చేస్తున్నట్లు ఆరోపణలు

Updated : 16 Apr 2024 05:19 IST

ఎస్‌ఆర్‌పురం సమీప దువ్వకొండ వద్ద తవ్విన కందకం

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురం గ్రామ రెవెన్యూ పరిధిలోని దువ్వకొండ వద్ద  గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడలేదు. ఈ కొండ వద్ద పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ అండతో ఓ వైకాపా నాయకుడు అక్రమంగా మట్టి, రాళ్లు తవ్వకాలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో రెండు నెలల క్రితం వైకాపాకు చెందిన పెందుర్తి ఎంపీపీ మధుపాడ నాగమణి భర్త అంజి, గ్రామస్థులు అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇష్టానుసారం కొండను తవ్వేయడంతో బోడిగుండులా మారడంతో పాటు విలువైన సంపద అక్రమంగా తరలిపోతోందని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా తరఫున మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కొండను పరిశీలించి అక్రమాలను ఎండగట్టారు. స్పందించిన రెవెన్యూ యంత్రాంగం అక్రమ తవ్వకాల నిరోధానికి కందకాలు తవ్వించారు. ఆ తరువాత తవ్వకాలు ఆగినా మళ్లీ షరా మామూలే అన్నట్లుగా మారింది. తాజాగా రాత్రివేళ తవ్వకాలు జరిపి మట్టి, రాళ్లు తరలిస్తున్నట్లు స్థానికులు చెప్పగా.. రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించినట్లు సమాచారం. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా రెవెన్యూ, గనుల శాఖాధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్వతంత్రంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని