logo

‘నీతి ఆయోగ్‌ సూచన అబద్ధమని నిరూపిస్తే రాజీనామా’

తెలంగాణకు రూ.24 వేల కోట్ల నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్‌ చేసిన సూచన అబద్ధమని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని.. లేని పక్షంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ చేయాల్సి

Published : 11 Aug 2022 03:48 IST

మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

మద్దూరు, న్యూస్‌టుడే: తెలంగాణకు రూ.24 వేల కోట్ల నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్‌ చేసిన సూచన అబద్ధమని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని.. లేని పక్షంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ చేయాల్సి ఉంటుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.3.68 లక్షల కోట్ల నిధులు తీసుకెళ్లి.. రాష్ట్రానికి రూ.1.68 లక్షల కోట్లను మాత్రమే కేటాయించి అన్యాయం చేశారని విమర్శించారు. మిగతా నిధులను ఇతర రాష్ట్రాలకు కేటాయించారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు ఎన్నిసార్లు కేంద్రాన్ని కోరినా మంజూరు చేయనందునే సీఎం ఇటీవల దిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరు కాలేదన్నారు. భాజపా నాయకులు రాష్ట్రంలో పాదయాత్రలు మాని.. నిధులు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. మద్దూరు ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటి, జాతీయ జెండాల ప్రదర్శన నిర్వహించారు.

దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ

బచ్చన్నపేట: దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్ల, ఆలీంపూర్‌ గ్రామాల్లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కుడా లేని విధంగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. రాష్ట్ర పథకాలను జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో రైబస జిల్లా కన్వీనర్‌ ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్‌ ఛైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి, సర్పంచులు బాల్‌రెడ్డి, ఖాలీంబేగం, ఎంపీటీసీ సభ్యురాలు లలిత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని