logo

‘ఎస్సారెస్పీ నీళ్లు కేసీఆర్‌ సొత్తు కాదు’

శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు నీళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత ఆస్తి కాదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల అన్నారు.

Published : 07 Feb 2023 06:04 IST

ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న షర్మిల

బాలసముద్రం, న్యూస్‌టుడే: శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు నీళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత ఆస్తి కాదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన పాదయాత్రలో భాగంగా సోమవారం హనుమకొండలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేసీఆర్‌ స్వార్థ రాజకీయాల కోసం శ్రీరామ్‌ సాగర్‌ నీటిని మహారాష్ట్ర ప్రజలకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైందన్నారు. ఈ నీటిని ఎత్తిపోసుకోండని బహిరంగంగా చెప్పడం సమంజసం కాదన్నారు. మహారాష్ట్రతో గోదావరి జలాలపై ఇప్పటికే అనేక వివాదాలు ఉన్నాయన్నారు. అనుమతి లేకుండానే మహారాష్ట్ర సర్కారు అనేక ప్రాజెక్టులు నిర్మించిందన్నారు. తెలంగాణను దోచుకున్నది చాలక దేశం మీద పడ్డారని విమర్శించారు. తెలంగాణలో అప్పుల బాధతో చాలా మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఆదుకోని భారాస.. మహారాష్ట్ర రైతులను ఎలా ఆదుకుంటుందని ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రభుత్వం బాధిత రైతు కుటుంబాలకు నయాపైసా సాయం చేయకపోవడం అత్యంత బాధాకరమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని