మామిడికి భలే గిరాకీ..!
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం మామిడి ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా మారింది. కొన్నేళ్లుగా ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు మామిడి ఎగుమతి అవుతోంది.
దంతాలపల్లి మార్కెట్‌లో..
దంతాలపల్లి (మరిపెడ), న్యూస్‌టుడే: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం మామిడి ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా మారింది. కొన్నేళ్లుగా ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు మామిడి ఎగుమతి అవుతోంది. గతంతో పోలిస్తే ఈ సారి మామిడి దిగుబడి ఆశించిన రీతిలో లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 13305 ఎకరాల్లో మామిడి, 596 ఎకరాల్లో నిమ్మ, 70 ఎకరాల్లో సపోట తోటలు సాగు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తోటల సాగు కొంత మేర తగ్గగా 5 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పెరగడం విశేషం. జిల్లాలోని 16 మండలాల్లో అత్యధికంగా కురవి మండలం 2444 ఎకరాలు సాగుచేయగా, అత్యల్పంగా కొత్తగూడ మండలం 11 ఎకరాల్లో సాగు చేశారు. కాత ప్రారంభ దశలో ఆశించిన ధర లభిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఇటీవల వచ్చిన వడగళ్ల వర్షాలకు మామిడి దిగుబడి బాగా తగ్గిపోయినట్లు రైతులు తెలిపారు. ఈ సారి ఎకరాకు 3 టన్నుల మేర దిగుబడి వస్తోందని ఉద్యానశాఖ అధికారులు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి మామిడి కాయల రాక మొదలవడంతో దంతాలపల్లిలోని ప్రైవేటు మామిడి కొనుగోలు కేంద్రాలు మామిడితో కళకళలాడుతున్నాయి.
టన్నుకు రూ.56 వేలు...
మామిడి దిగుబడి తగ్గడం దీనికి తోడు ఈదురు గాలులు, వడగళ్ల వర్షాలతో పంటకు నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 2367 ఎకరాల్లో మామిడి దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటగా గ్రామీణ ప్రాంతాల్లో మామిడిని రైతులు విక్రయిస్తున్నారు. దంతాలపల్లి మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం ప్రైవేటు వ్యక్తులు మామిడి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, వరంగల్ రూరల్ జిల్లాలకు చెందిన రైతులు తాము పండించిన మామిడిని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి ఇక్కడ మామిడి కొనుగోళ్లు కొనసాగుతుండటంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. రైతులు ఎక్కువగా తోతాపురి, బంగనపల్లి, రసాలు, దశేరి, సుందరి వంటి రకాలను సాగు చేశారు. ఇక్కడి మార్కెట్‌లో టన్నుకు గరిష్టంగా రూ.50 వేలు, కనిష్టంగా రూ.20 వేల ధర పలుకుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రత్యేక ప్యాకింగ్...
మామిడిని కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వస్తున్నారు. మార్కెట్‌లో రైతుల నుంచి కాయల్ని కొనుగోలు చేసిన అనంతరం ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కూలీలతో కాయ రకం, సైజును, రంగును బట్టి వేరు చేస్తారు. కాయల్ని శుభ్రం చేసి ప్లాస్టిక్ పెట్టెల్లో గడ్డి, పేపర్‌ల మధ్య భద్రపరుస్తారు. అనంతరం దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్ రాష్ట్రాల్లోని మార్కెట్లకు ఎగుమతి చేస్తారు. ఆశించిన ధర పలుకుతుండటంతో ఏటా అక్కడి వ్యాపారులు ఇక్కడకు వస్తుంటారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని యువకుడికి నోటీసు.. మఫ్టీలో పులివెందుల పోలీసులు
-
India News
సికింద్రాబాద్ - అగర్తలా రైలులో షార్ట్ సర్క్యూట్
-
Ap-top-news News
Viveka Murder Case: ‘భాస్కరరెడ్డి బయట ఉంటే సాక్షులెవరూ ముందుకు రారు’
-
Ap-top-news News
Vijayawada: 9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
Politics News
Sachin Pilot: సచిన్ పైలట్ కొత్త పార్టీ?
-
India News
Odisha Train Accident: పరిహారం కోసం ‘చావు’ తెలివి