logo

హస్తం.. అభ్యర్థులు ఖరారు

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. శుక్రవారం రాత్రి విడుదల చేసిన మలి జాబితాలో ఏడుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. వరంగల్‌ తూర్పు కొండా సురేఖ, వరంగల్‌ పశ్చిమ నాయిని రాజేందర్‌రెడ్డి, వర్దన్నపేట కేఆర్‌.నాగరాజు, పరకాల రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జనగామ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మహబూబాబాద్‌ డాక్టర్‌ మురళి నాయక్‌, పాలకుర్తి యశస్వినిరెడ్డి పేర్లు ఖరారయ్యాయి.

Published : 28 Oct 2023 03:37 IST

మలి జాబితాలో ఏడుగురి పేర్లు ప్రకటన
డోర్నకల్‌ పెండింగ్‌

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. శుక్రవారం రాత్రి విడుదల చేసిన మలి జాబితాలో ఏడుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. వరంగల్‌ తూర్పు కొండా సురేఖ, వరంగల్‌ పశ్చిమ నాయిని రాజేందర్‌రెడ్డి, వర్దన్నపేట కేఆర్‌.నాగరాజు, పరకాల రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జనగామ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మహబూబాబాద్‌ డాక్టర్‌ మురళి నాయక్‌, పాలకుర్తి యశస్వినిరెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఇప్పటికే తొలి జాబితాలో ములుగు సీతక్క, భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ, నర్సంపేట దొంతి మాధవరెడ్డి, స్టేషన్‌ఘాన్‌పూర్‌ ఇందిరాను ప్రకటించారు. డోర్నకల్‌ ఒక్కటే పెండింగ్‌లో పెట్టారు. డాక్టర్‌ రాంచంద్రునాయక్‌ పేరు ఖరారైనప్పటికి చివరి నిమిషంలో ప్రకటించ లేదు. వారం రోజుల కిందట కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డికి పరకాల టికెట్టు ఇచ్చారు.

నియోజకవర్గం: వరంగల్‌ తూర్పు

  • అభ్యర్థి పేరు: కొండా సురేఖ
  • గ్రామం: వంచనగిరి మండలం: గీసుకొండ జిల్లా వరంగల్‌: వరంగల్‌, కొన్నేళ్లుగా హనుమకొండ రాంనగర్‌లో స్థిర పడ్డారు.
  • ప్రస్తుత పదవి: టీపీసీసీ ఎన్నికల హమీల కమిటీ సభ్యురాలు, ఏఐసీసీ సభ్యురాలు
  • గతంలో: 1999, 2004, 2009 శాయంపేట, పరకాల నుంచి, 2014లో వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

వరంగల్‌ పశ్చిమ

  • నాయిని రాజేందర్‌రెడ్డి
  • హనుమకొండ నయీంనగర్‌ జాగృతి కాలనీ, జిల్లా: హనుమకొండ
  • హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు
  • గత పదేళ్లుగా ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, 2018లో చివరి సమయంలో పొత్తులో భాగంగా తెదేపాకు కేటాయించడంతో టికెట్టు దక్కలేదు. ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు.

వర్ధన్నపేట (ఎస్సీ)

  • కేఆర్‌.నాగరాజు
  • మామునూరు. మండలం: ఖిలావరంగల్‌, జిల్లా వరంగల్‌
  • రెండు నెలల కిందట కాంగ్రెస్‌లో చేరారు.
  • విశ్రాంత పోలీసు అధికారి, వరంగల్‌ ఉమ్మడి జిల్లా ప్రజలకు సుపరిచితులు

పరకాల

  • రేవూరి ప్రకాష్‌రెడ్డి
  • కేశవపురం, మండలం: దుగ్గొండి
  • వారం రోజుల కిందట భాజపా నుంచి కాంగ్రెస్‌లో చేరారు.
  • 1994, 1999, 2009 నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెదేపా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2018లో పొత్తులో భాగంగా తెదేపా తరఫున వరంగల్‌ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.

మహబూబాబాద్‌ (ఎస్టీ)

  • డాక్టర్‌ మురళినాయక్‌
  • పర్వతగిరి సోమ్ల తండా మండలం: మహబూబాబాద్‌ జిల్లా: మహబూబాద్‌
  • డాక్టర్‌ మురళినాయక్‌ వైద్యులుగా సుపరిచితులు.
  • ఆయన సతీమణి ఉమా నాయక్‌ మహబూబాబాద్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.

జనగామ

  • కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
  • నర్సయ్యపల్లి, మండలం: మద్దూరు. జిల్లా: జనగాం
  • జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు
  • 2004 సాధారణ ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో భారాస తరఫున చేర్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జనగామ నుంచి 2009లో భారాస, 2014లో భాజపా నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.

పాలకుర్తి 

  • మామిడాల యశస్విని
  • చెర్లపాలెం, మండలం: తొర్రూరు, జిల్లా: మహబూబాబాద్‌
  • ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎన్‌ఆర్‌ఐ ఝూన్సీరెడ్డి రెండో కోడలు

రంగంపేట, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని