logo

పకడ్బందీగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ

లోక్‌సభ ఎన్నికలు-2024 నిర్వహణలో భాగంగా వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి నామపత్రాల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్‌ అధికారి పి.ప్రావీణ్య ఆదేశించారు.

Published : 17 Apr 2024 04:59 IST

 ఏర్పాట్లపై చర్చిస్తున్న కలెక్టర్‌ ప్రావీణ్య చిత్రంలో సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలు-2024 నిర్వహణలో భాగంగా వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి నామపత్రాల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్‌ అధికారి పి.ప్రావీణ్య ఆదేశించారు. ఈ నెల 18 నుంచి నామపత్రాల స్వీకరణ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో కలెక్టరేట్‌ ఆవరణను ఆమె పరిశీలించారు. పోలీసు బందోబస్తు, మీడియా పాయింట్‌ తదితర ఏర్పాట్లపై మంగళవారం సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ నెల 25న నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ముగిసే వరకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి 100మీటర్ల దూరం మేర సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీసీపీ అబ్దుల్‌ బారీ, శిక్షణ ఐపీఎస్‌ శుభం నాగ్‌, డీఆర్వో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని