logo

సివిల్స్‌ ర్యాంకర్లకు ఘన సత్కారం

సివిల్స్‌ ఫలితాల్లో ఆల్‌ ఇండియా స్థాయిలో 82వ ర్యాంకు సాధించిన జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మెరుగు సుధాకర్‌ కుమారుడు మెరుగు కౌశిక్‌ను బుధవారం జిల్లాకు చెందిన ఆవోపా(ఆర్యవైశ్య ప్రొఫెషనల్‌ ఫెడరేషన్‌), ఐవీఎఫ్‌(ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌), ఇతర ప్రతినిధులు హైదరాబాద్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

Published : 18 Apr 2024 05:51 IST

మెరుగు కౌశిక్‌ను సన్మానిస్తున్న ఆవోపా, ఐవీఎఫ్‌ ప్రతినిధులు

జనగామ అర్బన్‌, రఘునాథపల్లి, న్యూస్‌టుడే: సివిల్స్‌ ఫలితాల్లో ఆల్‌ ఇండియా స్థాయిలో 82వ ర్యాంకు సాధించిన జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మెరుగు సుధాకర్‌ కుమారుడు మెరుగు కౌశిక్‌ను బుధవారం జిల్లాకు చెందిన ఆవోపా(ఆర్యవైశ్య ప్రొఫెషనల్‌ ఫెడరేషన్‌), ఐవీఎఫ్‌(ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌), ఇతర ప్రతినిధులు హైదరాబాద్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. దేశ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి ప్రాంతానికి పేరు తెచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో అవోపా జిల్లా అధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్‌కుమార్‌, ఐవీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బిజ్జాల నవీన్‌కుమార్‌, వాసవి క్లబ్‌ గ్రేటర్‌ జనగామ అధ్యక్షుడు రవీందర్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు. అలాగే రఘునాథపల్లి మండలానికి చెందిన కొయ్యడ ప్రణయ్‌ కుమార్‌ 554వ ర్యాంకు సాధించి, బుధవారం మండల కేంద్రానికి వచ్చిన తరుణంలో ఆయనకు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రణయ్‌ మొదటగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్‌ చూపిన బాటలో విధులు నిర్వర్తిస్తానని వివరించారు.ప్రణయ్‌ కుమార్‌తోపాటు తలిదండ్రులు లక్ష్మీ, ప్రభాకర్‌ను  నేతలు సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల వరలక్ష్మీ, జడ్పీటీసీ బొల్లం మణికంఠ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాగ కైలాసం, ఎమ్మార్పీఎస్‌ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు కొయ్యడ మల్లేశ్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు కోళ్ల రవి గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రణయ్‌ కుమార్‌, ఆయన తల్లిదండ్రులను సత్కరిస్తున్న ప్రజా సంఘాల నేతలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని