icon icon icon
icon icon icon

YS Sharmila: కడప ప్రజలు నేరం వైపా.. న్యాయం వైపా?: వైఎస్‌ షర్మిల

చెల్లెళ్లకంటే జగన్‌కు భార్య తరఫు బంధువులే  ఎక్కువయ్యారా? అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.

Published : 09 May 2024 22:40 IST

పులివెందుల: చెల్లెళ్లకంటే జగన్‌కు భార్య తరఫు బంధువులే ఎక్కువయ్యారా? అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. చిన్న పిల్లాడంటూ అవినాష్‌రెడ్డిని జగన్‌ కాపాడుతున్నారన్న ఆమె.. అంతలా కాపాడటానికి కారణమేంటని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి పులివెందులలో నిర్వహించిన రోడ్‌ షోలో పాల్గొన్న షర్మిల.. తాము అడిగే ప్రశ్నలకు జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. న్యాయం కోసం జగన్‌ చెల్లెళ్లు ఒక వైపు.. భారతి బంధువులు మరో వైపు ఉన్నారన్నారు. కడప ప్రజలు నేరం వైపా.. న్యాయం వైపా? అని దేశం మొత్తం ఎదురు చూస్తోందన్నారు.

వివేకా కల నెరవేర్చండి: సౌభాగ్యమ్మ

షర్మిలను ఎంపీ చేయాలన్నది వివేకానందరెడ్డి కల.. పులివెందుల ప్రజలు దాన్ని తప్పక నెరవేర్చాలని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ విజ్ఞప్తి చేశారు. పులివెందులలో నిర్వహించిన ప్రచార సభలో షర్మిల, సునీతతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఆడ బిడ్డలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img