icon icon icon
icon icon icon

గాజు గ్లాసు గుర్తు కేటాయింపు.. హైకోర్టుకు ఈసీ నివేదిక

గాజు గ్లాసు గుర్తు కేటాయింపు అంశంపై హైకోర్టుకు ఎన్నికల సంఘం (ఈసీ) నివేదిక సమర్పించింది. జనసేన పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాలతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇతరులకు ఆ గుర్తు కేటాయించబోమని ఈసీ స్పష్టం చేసింది.

Updated : 01 May 2024 13:46 IST

అమరావతి: గాజు గ్లాసు గుర్తు కేటాయింపు అంశంపై హైకోర్టుకు ఎన్నికల సంఘం (ఈసీ) నివేదిక సమర్పించింది. జనసేన పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాల (మచిలీపట్నం, కాకినాడ) పరిధిలోని అసెంబ్లీ సీట్లలో ఇతరులకు ఆ గుర్తు కేటాయించబోమని న్యాయస్థానానికి ఈసీ తెలిపింది. ఈ నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తొలగుతాయని ఈసీ అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు.. విచారణను ముగించింది.

తమ పార్టీ పోటీలో లేనిచోట్ల స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయించొద్దంటూ హైకోర్టును జనసేన ఆశ్రయించిన విషయం తెలిసిందే. మంగళవారం దీనిపై విచారణ జరిగింది. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ హైకోర్టుకు తెలిపారు. ఆ మేరకు నేడు ఈసీ నివేదిక అందజేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img