icon icon icon
icon icon icon

పోస్టల్ బ్యాలెట్‌ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం.. గుంటూరులో ఉద్యోగుల ఆందోళన

పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. గుంటూరు మహిళా కళాశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు లేవని ఉద్యోగులను తిరిగి పంపిస్తున్నారు.

Published : 09 May 2024 13:45 IST

గుంటూరు: పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. గుంటూరు మహిళా కళాశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు లేవని ఉద్యోగులను తిరిగి పంపిస్తున్నారు. జాబితాలో పేరు ఉన్నప్పటికీ పత్రాలు లేవంటూ సొంత నియోజకవర్గాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరులాంటి సుదూరు ప్రాంతాలకు ఎలా వెళ్లాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నేటితో పోస్టల్‌ బ్యాలెట్‌ ముగియనున్న నేపథ్యంలో అంతదూరం వెళ్లి ఎలా ఓటేయాలని ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసిన తమకు ఆయా పత్రాలు అందించాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img