icon icon icon
icon icon icon

మాడుగుల నుంచి బండారు?.. అనపర్తి నుంచి భాజపా తరఫున నల్లమిల్లి!

అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెదేపా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated : 21 Apr 2024 06:21 IST

ఈనాడు, అమరావతి: అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెదేపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జోన్‌-2 తెదేపా ఇన్‌ఛార్జి సుజయ కృష్ణ రంగారావు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం రాజమహేంద్రవరంలో రామకృష్ణారెడ్డిని కలిసి మాట్లాడారు. తెదేపా నుంచి టికెట్‌ ఇవ్వలేకపోవడానికి కారణాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కూడా ఆయనతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. జెండా ఏదైనా కూటమి ఎజెండా గెలవాలని సూచించారు. దీంతో నల్లమిల్లి పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇదే సమయంలో తమ పార్టీ తరఫున పోటీ చేయాలని భాజపా అధిష్ఠానం నుంచి కూడా ఆయనకు ఆహ్వానం వచ్చినట్లు తెలిసింది. ఆదివారం అనుచరులతో సమావేశం తర్వాత రామకృష్ణారెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img