icon icon icon
icon icon icon

జగన్‌రెడ్డి డ్రామాకు పోలీసుల సారథ్యం

ప్రజల్ని మోసం చేసి సానుభూతి ఓట్లు దండుకోవాలని సీఎం జగన్‌ ఆడిన గులకరాయి డ్రామాకు విజయవాడ పోలీసులు సారథ్యం వహిస్తున్నారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు.

Published : 21 Apr 2024 05:55 IST

నిందితుడు మేజర్‌ అంటూ తప్పుడు ధ్రువపత్రం
తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రజల్ని మోసం చేసి సానుభూతి ఓట్లు దండుకోవాలని సీఎం జగన్‌ ఆడిన గులకరాయి డ్రామాకు విజయవాడ పోలీసులు సారథ్యం వహిస్తున్నారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు. న్యాయస్థానానికి నకిలీ ధ్రువపత్రాలు, తప్పుడు నివేదికలు సమర్పించి పోలీసులు అడ్డంగా దొరికిపోయారని అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వేముల సతీష్‌ను మేజర్‌గా చూపించేందుకు పోలీసులు తప్పుడు జనన ధ్రువపత్రాన్ని సృష్టించారని విమర్శించారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా, ఇతర అధికారులు.. అమాయకులైన వడ్డెర బిడ్డల్ని, మైనర్లను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంతిరాణాపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. ‘సతీష్‌ ఆధార్‌కార్డు ప్రకారం అతడు మైనర్‌ అని తెలుస్తోంది. కోర్టుకు సమర్పించిన సాక్షుల వాంగ్మూలంలోనూ ఏప్రిల్‌ 14 అతడి పుట్టినరోజుగా పేర్కొన్నారు. కానీ విజయవాడ పోలీసులు మైనర్‌ను మేజర్‌గా మార్చేందుకు అతడి పుట్టిన రోజును అక్టోబరు 14గా మార్చారు’ అని పట్టాభిరామ్‌ పేర్కొన్నారు. స్థానికులెవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాకపోవడంతో పులివెందులకు చెందిన నందినేని మనోహర్‌నాయుడిని పోలీసులు సాక్షిగా కోర్టులో హాజరుపరిచారని పట్టాభి ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img