icon icon icon
icon icon icon

80 శాతం వక్ఫ్‌బోర్డు ఆస్తుల్ని వైకాపా నేతలు ఆక్రమించారు

వైకాపా నాయకులు.. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం వక్ఫ్‌బోర్డు ఆస్తుల్ని, వాటికి సంబంధించిన 30 వేల ఎకరాల భూముల్ని ఆక్రమించారని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించారు.

Published : 21 Apr 2024 06:10 IST

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి ధ్వజం

ఈనాడు-చిత్తూరు; న్యూస్‌టుడే-కుప్పం పట్టణం: వైకాపా నాయకులు.. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం వక్ఫ్‌బోర్డు ఆస్తుల్ని, వాటికి సంబంధించిన 30 వేల ఎకరాల భూముల్ని ఆక్రమించారని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించారు. చివరికి ప్రార్థనా మందిరాలు, శ్మశానాలనూ వదిలిపెట్టడం లేదని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలకు మంచి, మర్యాదన్నదే లేదని విమర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలో రెండో రోజైన శనివారం భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఉదయం సామగుట్టపల్లె కదిరిబండ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసి కేకు కోశారు. అనంతరం పట్టణంలో ముస్లిం మహిళలతో ‘దిల్‌ కీ బాత్‌’ కార్యక్రమం నిర్వహించి, సీనియర్‌ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు, కార్యకర్తలకే చంద్రబాబు మొదటి ప్రాధాన్యం ఇస్తారని, కుటుంబానికి ఎప్పుడూ రెండో స్థానమేనని పేర్కొన్నారు. ‘దేశంలో ఎక్కడా లేని చెడంతా రాష్ట్రంలోనే ఉంది. ఎవరైనా నోరు విప్పితే చంపుతారు. కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. ఇదేం పాలన? సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లి ప్రజల ప్రభుత్వాన్ని తీసుకురావాలి’ అని భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img