icon icon icon
icon icon icon

మహిళలపై దాడుల్లో ఏపీనే మొదటి స్థానం

వైకాపా పాలనలో మహిళలపై జరుగుతున్న దాడుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలోకి చేరింది. సీఎం ఇంటికి సమీపంలోనే దుండగులు భర్త ముందు ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు.

Updated : 21 Apr 2024 06:21 IST

ఎన్డీయే మహిళా నేతల ధ్వజం


 

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘వైకాపా పాలనలో మహిళలపై జరుగుతున్న దాడుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలోకి చేరింది. సీఎం ఇంటికి సమీపంలోనే దుండగులు భర్త ముందు ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. విజయవాడ ఆసుపత్రిలో ఓ దివ్యాంగురాలిపై అఘాయిత్యం చేశారు. జగన్‌ హయాంలో మహిళలపై 1,001, మైనర్‌ బాలికలపై 1,824 అత్యాచారాలు జరిగాయి. 43,340 మంది మహిళలు అదృశ్యమయ్యారు. వీటిపై కనీసం స్పందించని మీరు ఏ మోహం పెట్టుకుని మహిళలను ఓట్లు అడుగుతున్నారు’ అని జనసేన అధికార ప్రతినిధి కీర్తన, భాజపా అధికార ప్రతినిధి యామిని శర్మ, తెదేపా డ్వాక్రా, అంగన్‌వాడీ విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత నిలదీశారు. మహిళలపై జరుగుతున్న దాడులపై సీఎం జగన్‌, మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ ఒక్కసారి కూడా స్పందించలేదని విమర్శించారు. కానీ ఈ ఉదంతాలపై ప్రశ్నించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఎదురుదాడి చేస్తున్నారని, వ్యక్తిగత అంశాలను రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. జనసేన కేంద్ర కార్యాలయంలో వారు శనివారం విలేకరులతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img