icon icon icon
icon icon icon

సీఎం జగన్‌పై 26 కేసులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై 26 కేసులున్నాయి. ఆయన 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఏపీ, తెలంగాణలోని వివిధ పోలీసుస్టేషన్లలో ఆయనపై మరో 6 కేసులున్నాయి.

Updated : 23 Apr 2024 06:59 IST

11 సీబీఐ కేసుల్లో, 9 ఈడీ కేసుల్లో నిందితుడు
వివిధ పోలీసుస్టేషన్లలో మరో ఆరు కేసులు
అఫిడవిట్‌లో వెల్లడించిన ముఖ్యమంత్రి
పులివెందులలో నామినేషన్‌ పత్రాలు సమర్పించిన వైఎస్‌ మనోహర్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై 26 కేసులున్నాయి. ఆయన 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఏపీ, తెలంగాణలోని వివిధ పోలీసుస్టేషన్లలో ఆయనపై మరో 6 కేసులున్నాయి. జగన్‌ తరఫున వరుసకు బాబాయ్‌ అయిన వైఎస్‌ మనోహర్‌రెడ్డి సోమవారం పులివెందులలోని రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. దాంతో పాటు అఫిడవిట్‌ దాఖలు చేశారు. దాని ప్రకారం జగన్‌పై అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)తో పాటు, మోసం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలతో కేసులున్నాయి. సీబీఐ, ఈడీ కేసులన్నీ హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయి. వీటితో పాటు జాతీయ గీతానికి అవమానం కలిగించటం, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, అనుచిత ప్రవర్తన, పరువునష్టం కలిగించడం తదితర అభియోగాలతో ఆయనపై కేసులున్నాయి.

సీబీఐ కేసులు-11

1. హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌ ఫార్మా కంపెనీల కేసు
2. జగతి పెట్టుబడుల కేసు
3. రాంకీ ఫార్మా కేసు
4. వాన్‌పిక్‌ ప్రాజెక్టు కేసు
5. దాల్మియా సిమెంట్‌ కేసు
6. ఇండియా సిమెంట్‌ కేసు
7. రఘురాం/భారతి సిమెంట్‌ కేసు
8. పెన్నా సిమెంట్‌ కేసు
9. ఇందూ టెక్‌జోన్‌ కేసు
10. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేసు
11. ఇందూ-గృహనిర్మాణ మండలి సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు కేసు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులు: 9

1. జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు
2. రాంకీ పెట్టుబడుల కేసు
3. ఇండియా సిమెంట్స్‌ పెట్టుబడులు కేసు
4. ఇందూ టెక్‌జోన్‌ పెట్టుబడుల కేసు
5. పెన్నా గ్రూపు నుంచి పెట్టుబడులు
6. హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌ లైఫ్‌సైన్సెస్‌ ఫార్మా కంపెనీ పెట్టుబడుల కేసు

ఇంకా ఎస్‌సీ నంబర్‌ 1/2021, 2/2021, 3/2021 పేరిట మరో మూడు కేసులు నమోదయ్యాయి.
ఇవి కాక రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీసుస్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img