icon icon icon
icon icon icon

వివేకా హత్యకేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నామినేషన్‌ తిరస్కరణ

వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కడప ఎంపీ స్థానానికి దాఖలు చేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.

Updated : 27 Apr 2024 05:38 IST

ఈనాడు, కడప: వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కడప ఎంపీ స్థానానికి దాఖలు చేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఈ స్థానానికి మొత్తం 32 మంది నామినేషన్లు వేయగా.. వాటిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో సహా 18 మంది నామినేషన్లను ఆమోదించారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన శివశంకర్‌రెడ్డి ప్రమాణ పత్రం దాఖలు చేయాల్సి ఉంది. ఆర్వో ఎదుట దాన్ని చదవాల్సి ఉంటుంది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి ఇటీవల బెయిల్‌పై విడుదలై న్యాయస్థానం ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ నెల 18న అతడి తరఫున విద్యాధర్‌రెడ్డి అనే వ్యక్తి నామినేషన్‌ వేశారు. పరిశీలనలో ప్రమాణపత్రం లేనట్లు గుర్తించిన ఆర్వో.. ఆ నామినేషన్‌ను తిరస్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img