icon icon icon
icon icon icon

మంత్రి రజిని నామినేషన్‌ తప్పులతడక: తెదేపా

మంత్రి విడదల రజిని అఫిడవిట్లో లెక్కలేనన్ని తప్పులున్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మ్యాని విమర్శించారు.

Published : 27 Apr 2024 05:39 IST

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే: మంత్రి విడదల రజిని అఫిడవిట్లో లెక్కలేనన్ని తప్పులున్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మ్యాని విమర్శించారు. గుంటూరులోని తెదేపా ఎన్నికల కార్యాలయంలో వారు విలేకర్లతో మాట్లాడారు. ‘రజిని భర్త కుమారస్వామికి అమెరికా పౌరసత్వం ఉంది. అలాంటివాళ్లు ఇక్కడ వ్యవసాయ భూమి కొనేందుకు వీల్లేదు. కానీ కుమారస్వామి చిలకలూరిపేట మండలం పోలిరెడ్డి గ్రామంలో 50 సెంట్ల భూమి కొన్నారు. అఫిడవిట్లో 2021లో వార్షికాదాయం రూ.3,96,400గా మాత్రమే పేర్కొన్న రజిని పెదపలకలూరులో రూ.4,55,56,500 విలువ కలిగిన భూమిని ఎలా కొన్నారో చెప్పాలి. శ్యామలనగర్‌లో స్థలం కొని, అత్యాధునికంగా ఇంటీరియర్‌ వర్క్‌ చేయించారు. ఎన్నికల అధికారిణికి మేము సాక్ష్యాధారాలతో విన్నవించినా ఏకపక్షంగా ఆమె నామినేషన్‌ను ఆమోదించడం దుర్మార్గం. దీనిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేశాం. న్యాయం జరగకపోతే న్యాయస్థానం తలుపు తడతాం’.. అని హెచ్చరించారు.


తెదేపా అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి

ఈనాడు డిజిటల్‌, అమరావతి:  తెదేపా అధికార ప్రతినిధిగా తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని, రాష్ట్ర కార్యదర్శిగా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మల్లెల రాజేశ్‌నాయుడును తెదేపా నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్టు స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img