icon icon icon
icon icon icon

స్పందించిన జిల్లా ఎన్నికల అధికారి

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని సాగుతున్న వివాదంలో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి డి.కె.బాలాజీ స్పందించారు.

Published : 27 Apr 2024 05:42 IST

ఆయన ఆదేశాలతో తెదేపా నాయకుల్ని ఆధారాలు కోరిన ఆర్వో

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని సాగుతున్న వివాదంలో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి డి.కె.బాలాజీ స్పందించారు. ఆయన ఆదేశాలతో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) పి.పద్మావతి స్పందించి కొడాలి నాని నామినేషన్‌ తిరస్కరణకు మీ వద్ద ఉన్న ఆధారాలు సమర్పించాలని శుక్రవారం రాత్రి తెదేపా నాయకుడు కె.తులసిబాబుకు నోటీసులిచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కొడాలి నాని నామినేషన్‌ పత్రంలో అసత్య సమాచారమిచ్చారని అభ్యంతరం తెలిపేందుకు వచ్చినా ఆర్వో పద్మావతి ఏకపక్ష ధోరణితో వ్యవహరించి నాని నామినేషన్‌ అనుమతించారని శుక్రవారం ఉదయం తెదేపా నాయకులు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, కె.తులసిబాబులు ఆరోపించారు. అసత్య సమాచారం ఇచ్చిన నాని నామినేషన్‌ను ఎన్నికల నిబంధనల ప్రకారం తిరస్కరించి, ఆర్వోపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీకి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో 24 గంటల్లో మీ అభ్యంతరాలకు ఆధారాలు సమర్పించాలని, లేకుంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని గుడివాడ ఆర్వో పద్మావతి తెదేపా నాయకుడు తులసిబాబుకు నోటీసిచ్చారు. పాత పురపాలక కార్యాలయాన్ని ఎమ్మెల్యే నాని వినియోగించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ఇచ్చిన ఆధారాలను తెదేపా నాయకులు సమర్పిస్తే ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తారా? తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img