icon icon icon
icon icon icon

ఐప్యాక్‌ సూచనతోనే జగన్‌ బ్యాండేజ్‌ తీయడం లేదు: వర్ల రామయ్య ధ్వజం

సీఎం జగన్‌కు గాయమై రెండు వారాలు గడుస్తున్నా... ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికే ఆయన బ్యాండేజ్‌ తీయడం లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.

Published : 27 Apr 2024 05:47 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌కు గాయమై రెండు వారాలు గడుస్తున్నా... ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికే ఆయన బ్యాండేజ్‌ తీయడం లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. బ్యాండేజ్‌ తీయకపోతే సెప్టిక్‌ అవుతుందని డాక్టర్లు చెబుతున్నా ఆయన వినడం లేదన్నారు. గొడ్డలి వేటు సూత్రధారి అవినాష్‌రెడ్డిని అమాయకుడని జగన్‌ పరిచయం చేయడం ప్రజల్ని వంచించడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎంపీ అవినాష్‌రెడ్డిని చిన్నపిల్లోడని అనడంలో జగన్‌ ఔచిత్యమేంటి? అమాయకుడు అనడంలో అర్థం ఏమిటి? గొడ్డలి వేటు ఘటనలో సూత్రధారి అమాయకుడా?’’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img