icon icon icon
icon icon icon

ఇండోసోల్‌కు 8,500 ఎకరాల్ని కట్టబెట్టేందుకు జగన్‌ యత్నం: దేవినేని

రామాయపట్నం పరిసరాల్లోని 8,500 ఎకరాల రైతుల భూముల్ని.. సీఎం జగన్‌ తన బినామీ కంపెనీ ఇండోసోల్‌కు కారుచౌకగా కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Published : 27 Apr 2024 05:48 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రామాయపట్నం పరిసరాల్లోని 8,500 ఎకరాల రైతుల భూముల్ని.. సీఎం జగన్‌ తన బినామీ కంపెనీ ఇండోసోల్‌కు కారుచౌకగా కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పేదల భూముల్ని కాజేసేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తెచ్చిందని ధ్వజమెత్తారు. ఈసారి వైకాపాకు ఓటేస్తే.. కర్షకుల భూ హక్కులు, పౌరుల ఆస్తి హక్కులపై అధికారాన్ని జగన్‌కు కట్టబెట్టినట్లే అవుతుందని హెచ్చరించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ద్వారా లక్షల ఎకరాల్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ చట్టం కారణంగా ఒంటిమిట్టలో చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుంది’’ అని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మే ఒకటి నుంచైనా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ జవహర్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img