icon icon icon
icon icon icon

అమిత్‌షా ప్రసంగాన్ని వక్రీకరించారు..

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రసంగాన్ని కాంగ్రెస్‌వారు వక్రీకరించి ఆ పార్టీ అధికార ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు ఆరోపించారు.

Published : 28 Apr 2024 05:55 IST

సీఈఓకు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణరాజు ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రసంగాన్ని కాంగ్రెస్‌వారు వక్రీకరించి ఆ పార్టీ అధికార ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు ఆరోపించారు. మైనారిటీల రిజర్వేషన్ల గురించి అమిత్‌షా మాట్లాడిన అంశాన్ని ఎస్సీ ఎస్టీలకు ఆపాదిస్తూ ఫేక్‌ వీడియో రూపొందించారని సీఈఓకు శనివారం ఫిర్యాదు చేశారు.

ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయాలి

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని భాజపా మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం డిమాండ్‌ చేశారు. పింఛన్‌దారులను ఇబ్బందులు పెట్టడమే మీ ఉద్దేశమా? అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని ప్రశ్నించారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ను విమర్శించే అర్హత మంత్రి బొత్సకు లేదని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img