icon icon icon
icon icon icon

ఏం.. తమాషాలు చేస్తున్నారా?

ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్న అధికారిణిపై రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు రెచ్చిపోయారు. ఆమె వైపు వేలు చూపుతూ ‘ఏం తమాషాలు చేస్తున్నారా..? ఇంకోసారి మా వాహనాలు ఆపితే బాగోదు..

Published : 28 Apr 2024 06:15 IST

ఎన్నికల నిఘా అధికారిణిపై రెచ్చిపోయిన మంత్రి అప్పలరాజు  
మరోసారి తమ వాహనాలు ఆపితే  బాగోదంటూ బెదిరింపు

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం: ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్న అధికారిణిపై రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు రెచ్చిపోయారు. ఆమె వైపు వేలు చూపుతూ ‘ఏం తమాషాలు చేస్తున్నారా..? ఇంకోసారి మా వాహనాలు ఆపితే బాగోదు.. ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మంత్రి వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కోసంగిపురం వద్ద శుక్రవారం ఎన్నికల నిఘా బృందం, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీం (ఎస్‌ఎస్‌టీ) ఇన్‌ఛార్జి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ ఆశాలత ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో మంత్రి వాహనశ్రేణి, ప్రచార రథాలు వచ్చాయి. ఓ ప్రచార రథానికి కట్టిన పెద్ద జెండాలకు అనుమతి లేదని గుర్తించారు. ఈ విషయాన్ని మంత్రికి తెలపగా, తీవ్ర ఆగ్రహానికి గురైన అప్పలరాజు అధికారిణిపై మండిపడ్డారు. ‘ఇంత జెండానే ఉండాలన్న రూల్‌ చూపండి. వాట్స్‌ హ్యాపెనింగ్‌ హియర్‌. ఒక పని చేయండి.. ప్రచార రథం, రూ.లక్ష ఆమెకు ఇచ్చేయండి. ఎలా కావాలో అలా తయారు చేసి ఇచ్చేయండి. మేం వాడుకుంటాం.. మాకు ఏంటీ టార్చర్‌’ అంటూ రెచ్చిపోయారు. టార్చర్‌ ఏమీ లేదని ఆమె చెబుతున్నా.. మంత్రి మాత్రం టార్చరే అంటూ వాదనకు దిగారు. ప్రచార రథం ఇచ్చేస్తాం.. మీకు నచ్చిన రంగులేసి ఇచ్చేయండని ఆశాలతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ఇలా వినమ్మా.. నా వైపు చూడమ్మా.. రాష్ట్రంలో ప్రచార రథాలు ఎక్కడా లేవా? ఒక్క పలాసలోనే ఉన్నాయా? సే యస్‌ ఆర్‌ నో’.. ఇంకోసారి వెహికల్‌, ప్రచారరథం ఆగితే బాగోదు.. సీరియస్‌గా చెబుతున్నా’ అంటూ  బెదిరింపులకు దిగారు. డోంట్‌ బీ టూ స్మార్ట్‌.. మీరొక్కరే డ్యూటీ చేస్తున్నారా ఇక్కడ? పర్మిషన్‌ బుక్‌ చూపించండి.. ఓవర్‌ స్మార్ట్‌నెస్‌ వద్దు’ అంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img