icon icon icon
icon icon icon

‘గాజు గ్లాసు’ జనసేనకే రిజర్వు

ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ‘‘గాజు గ్లాసు’’ గుర్తును జనసేనకు కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Published : 29 Apr 2024 05:45 IST

ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఇంకెవరికీ కేటాయించరు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ‘‘గాజు గ్లాసు’’ గుర్తును జనసేనకు కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఆ గుర్తును ఎవరికీ కేటాయించరు. పొత్తుల్లో భాగంగా 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ రిజిస్టర్డ్‌ పార్టీలకు సంబంధించిన ‘‘కామన్‌ సింబల్‌’’లను ఖరారు చేసిన ఎన్నికల సంఘం ఆ సమాచారాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లకు, వారి ద్వారా రిటర్నింగ్‌ అధికారులకు పంపింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్న జై భారత్‌ నేషనల్‌ పార్టీకి టార్చ్‌లైట్‌ గుర్తు, జడ శ్రవణ్‌కుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీకి కోటు గుర్తు, రామచంద్రయాదవ్‌ అధ్యక్షుడిగా ఉన్న భారత చైతన్య యువజన పార్టీకి చెరుకు రైతు గుర్తు, కేఏ పాల్‌ అధ్యక్షుడిగా ఉన్న ప్రజాశాంతి పార్టీకి కుండ గుర్తు కేటాయించింది. 175 శాసనసభ నియోజకవర్గాల్లోనూ ఆ గుర్తులు ఆయా పార్టీల అభ్యర్థులకే ఇస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img