icon icon icon
icon icon icon

కేశినేని నాని తప్పుడు అఫిడవిట్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం

ఎంపీ కేశినేని నాని తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేయడంపై ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి ఫిర్యాదు చేస్తామని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.

Published : 29 Apr 2024 05:50 IST

మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

విద్యాధరపురం, న్యూస్‌టుడే: ఎంపీ కేశినేని నాని తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేయడంపై ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి ఫిర్యాదు చేస్తామని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఆదివారం విజయవాడ మల్లికార్జునపేటలోని పశ్చిమ తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని ట్రావెల్స్‌లో పనిచేసే కార్మికులకు వేతనాలు ఎగ్గొట్టిన సందర్భంగా నమోదైన కేసును నాని తన అఫిడవిట్‌లో చూపలేదన్నారు. సుజనా చౌదరి వద్దకు క్యారేజీలు మోసుకొచ్చిన వ్యక్తి.. ఊసరవెల్లిలా పార్టీ మారగానే గతాన్ని మరచిపోతే గుర్తు చేసేందుకు తాము ఉన్నామని ఎద్దేవా చేశారు. సొంత తల్లితో పాటు కుటుంబసభ్యులు కూడా నానికి మద్దతు ఇవ్వకపోవడం ఆయన నైజాన్ని తెలియజేస్తుందన్నారు. తన 2014 అఫిడవిట్‌లో శ్రీరామ్‌ చిట్స్‌కు డబ్బులు ఇవ్వాలని, ఐవోబీకి రూ.30కోట్ల బకాయిలు ఉన్నట్లు పేర్కొన్నారన్నారు. 2024అఫిడవిట్‌లో సైతం ఇవే అప్పులు పేర్కొన్న ఆయనకి.. ఇతరుల గురించి మాట్లాడే నైతికత లేదని బుద్దా మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img