icon icon icon
icon icon icon

వాలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.2.5 లక్షలు

గుడివాడలో వైకాపా నాయకులు వాలంటీర్లతో రాజీనామా చేయించి ఒక్కొక్కరికి రూ.2.5 లక్షలిచ్చి పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లుగా నియమిస్తున్నారని.. ఈ మేరకు కొందరు నాయకులు వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని గుడివాడ మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, తెదేపా పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు ఆరోపించారు.

Published : 30 Apr 2024 08:52 IST

గుడివాడలో బూత్‌ ఏజెంట్లుగా నియమించేందుకు వైకాపా ప్రలోభాలు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గుడివాడలో వైకాపా నాయకులు వాలంటీర్లతో రాజీనామా చేయించి ఒక్కొక్కరికి రూ.2.5 లక్షలిచ్చి పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లుగా నియమిస్తున్నారని.. ఈ మేరకు కొందరు నాయకులు వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని గుడివాడ మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, తెదేపా పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు ఆరోపించారు. తెదేపా కార్యాలయం ప్రజావేదికలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతో వైకాపా నాయకులు వాలంటీర్లను ప్రలోభాలకు గురి చేసి వారితో రాజీనామా చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. వైకాపా నూతన మ్యానిఫెస్టోపై వారికి శిక్షణ ఇచ్చి.. అధికారంలోకి మళ్లీ వైకాపానే వస్తుందని..తామే మళ్లీ ఇంటింటికీ వచ్చి అన్ని పథకాలనూ అందించేదని చెప్పి ఓటర్లను భయపెట్టేలా చూడాలని వాలంటీర్లకు వైకాపా నాయకులు నూరిపోస్తున్నారని ఆరోపించారు. వైకాపా ప్రలోభాలకు వాలంటీర్లు లొంగిపోతే.. తెదేపా అధికారంలోకి వచ్చాక ఇచ్చే రూ.10 వేల వేతనం కోల్పోతారని వారు హెచ్చరించారు. ఒక సారి వచ్చే రూ.2.5 లక్షలకు ఆశపడి జీవితాంతం వచ్చే మేలును వదులుకోవద్దని హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img