icon icon icon
icon icon icon

వైకాపా మోసాలతో ముస్లిం సమాజం విసిగిపోయింది

వైకాపా పాలనలో మైనారిటీల సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయిందని, అయిదేళ్లుగా జగన్‌ చేస్తున్న మోసాలకు ముస్లిం సమాజం విసిగిపోయిందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్‌ షిబ్లీ విమర్శించారు.

Published : 30 Apr 2024 06:03 IST

ఎన్నికల్లో తెదేపాకే సంపూర్ణ మద్దతు
మైనారిటీ సంఘాల ఐకాస తీర్మానం

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే: వైకాపా పాలనలో మైనారిటీల సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయిందని, అయిదేళ్లుగా జగన్‌ చేస్తున్న మోసాలకు ముస్లిం సమాజం విసిగిపోయిందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్‌ షిబ్లీ విమర్శించారు. సోమవారం గుంటూరులోని ఓ హోటల్‌లో ‘రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం నాడు-నేడు’ అనే అంశంపై మైనారిటీ సంఘాల ఐకాస రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. 17 సంఘాల నాయకులు హాజరై వైకాపా ప్రభుత్వం ముస్లింలకు చేసిన ద్రోహంపై చర్చించారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. తెదేపా అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటేనే మైనారిటీలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతారని వారు పేర్కొన్నారు. ఫరూక్‌ షిబ్లీ మాట్లాడుతూ ‘2014 నుంచి 2019 వరకు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను తెదేపా ప్రభుత్వం కొనసాగించింది. రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉండగా ముస్లింలపై ఎటువంటి దాడులు జరగలేదు. జగన్‌.. రాజధాని అమరావతిని నాశనం చేయడంతో ముస్లింల ఉపాధి దెబ్బతింది. గుంటూరు, విజయవాడ ఆటోనగర్‌లో పనిచేసేది ఎక్కువగా మైనారిటీలే’ అని పేర్కొన్నారు. కార్యక్రమానికి    అధ్యక్షత వహించిన ముస్లిం హక్కుల పోరాట   సమితి అధ్యక్షుడు షేక్‌ ఖాజావలి మాట్లాడుతూ మైనారిటీలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇస్లామిక్‌ ఫ్రంట్ అధినేత షేక్‌ అక్రం, ముస్లిం చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ నాగూర్‌, వక్ఫ్‌ బోర్డు ఆస్తుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు షేక్‌ లాల్‌వజీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img