icon icon icon
icon icon icon

ఐదేళ్లు ఏం వెలగబెట్టారు?

‘పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటి ఐదేళ్లు జగన్‌ ముఖ్యమంత్రి కాలేదన్నారు. అనంతరం జగన్‌ సీఎం అయ్యాక ఏమి వెలగబెట్టారు’ అంటూ తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని పూలతోట పంచాయతీ కట్టువాపల్లి వాసులు వైకాపా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను అడ్డుకుని ప్రశ్నించారు.

Published : 01 May 2024 06:14 IST

సూళ్లూరుపేట ఎమ్మెల్యేను ప్రశ్నించిన ప్రజలు
తుపాను వచ్చినా ఆదుకోలేదని నిలదీత

దొరవారిసత్రం, న్యూస్‌టుడే: ‘పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటి ఐదేళ్లు జగన్‌ ముఖ్యమంత్రి కాలేదన్నారు. అనంతరం జగన్‌ సీఎం అయ్యాక ఏమి వెలగబెట్టారు’ అంటూ తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని పూలతోట పంచాయతీ కట్టువాపల్లి వాసులు వైకాపా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను అడ్డుకుని ప్రశ్నించారు. శ్రీచెంగాళమ్మ ఆలయ ఛైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, వైకాపా నాయకులతో కలిసి కట్టువాపల్లి ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. స్థానికులు ఆయన ప్రచార రథాన్ని అడ్డుకుని పదేళ్లుగా మీరు చేసిన అభివృద్ధి ఎక్కడని ప్రశ్నించారు. తుపాను వచ్చి గ్రామం నీటిలో మునిగిపోతే కనీసం బియ్యం ఇవ్వలేదని, పరామర్శకు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలనూ పరిష్కరించలేదన్నారు. గత తెదేపా ప్రభుత్వంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. దీంతో ఎమ్మెల్యే సంజీవయ్య కలగజేసుకుని ‘మీకు అమ్మఒడి, రైతు భరోసా, పింఛను వస్తుంది కదా’ అంటూ సంక్షేమ పథకాల ప్రస్తావన తెచ్చినా.. స్థానికులు శాంతించలేదు. ఈ దృశ్యాలను కొందరు యువకులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో నియోజకవర్గంలో ఈ విషయం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img