icon icon icon
icon icon icon

కర్నూలులో స్వతంత్ర అభ్యర్థిని బెదిరించిన వైకాపా నాయకులపై కేసు

ఎన్నికల బరి నుంచి తప్పుకోకుంటే నీ అంతు చూస్తామని స్వతంత్ర అభ్యర్థిని బెదిరించిన కర్నూలుకు చెందిన వైకాపా నాయకులు ఉస్తాద్‌ మహ్మద్‌అలీ, షేక్షాలపై మంగళవారం కేసు నమోదైంది.

Updated : 01 May 2024 07:15 IST

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఎన్నికల బరి నుంచి తప్పుకోకుంటే నీ అంతు చూస్తామని స్వతంత్ర అభ్యర్థిని బెదిరించిన కర్నూలుకు చెందిన వైకాపా నాయకులు ఉస్తాద్‌ మహ్మద్‌అలీ, షేక్షాలపై మంగళవారం కేసు నమోదైంది. స్థానిక గరీబ్‌నగర్‌కు చెందిన ఎస్‌.ఇంతియాజ్‌బాషా కర్నూలు అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఏప్రిల్‌ 28 రాత్రి నిందితులిద్దరూ స్వతంత్ర అభ్యర్థి ఇంటికెళ్లి నామినేషన్‌ ఉపసంహరించుకొని, ఊరు విడిచి వెళ్లిపోవాలని.. లేకుంటే నీ అంతు చూస్తామని హెచ్చరించారు. సోమవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఇంతియాజ్‌బాషాకు డిష్‌ యాంటెన్నా గుర్తు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆయన కర్నూలు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో తనను బెదిరించినట్లు ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో పోలీసులు ఉస్తాద్‌ మహ్మద్‌అలీ, షేక్షాలపై మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇంతియాజ్‌బాషా ఓ వీడియో విడుదల చేశారు. వైకాపా నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. వైకాపా అభ్యర్థి నిందితులతో మాట్లాడారని, ఎన్నికల్లో గెలవకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారని.. గెలిస్తే సామాన్యుల్ని బతకనిస్తారా అని వాపోయారు. తనకేదైనా జరిగితే వారిద్దరే బాధ్యులంటూ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img