icon icon icon
icon icon icon

వాలంటీర్లు జగన్‌ విజయానికి పనిచేయాలి: వైకాపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

వాలంటీర్లు పోలింగ్‌ రోజు వరకు జగన్‌ విజయానికి కష్టపడి పని చేయాలని నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఆదేశించడం వివాదాస్పదంగా మారింది.

Updated : 01 May 2024 08:12 IST

ఈనాడు, కర్నూలు - నంద్యాల, న్యూస్‌టుడే: వాలంటీర్లు పోలింగ్‌ రోజు వరకు జగన్‌ విజయానికి కష్టపడి పని చేయాలని నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఆదేశించడం వివాదాస్పదంగా మారింది. నంద్యాల పట్టణంలోని వాలంటీర్లతో మంగళవారం ఆయన ఓ హోటల్లో సమావేశమయ్యారు. రాజీనామాలు చేసిన వారు మాత్రమే పాల్గొన్నారని చెబుతున్నప్పటికీ.. విధుల్లో ఉన్న సుమారు 30 నుంచి 40 మంది సైతం హాజరయ్యారు. చాలామంది వాలంటీర్లు తమకు 35 ఏళ్లు దాటాయని, రాజీనామా చేస్తే మళ్లీ విధుల్లోకి తీసుకుంటారో.. లేదోనని సందేహం వ్యక్తం చేశారు. ‘అలాంటి భయాలు పెట్టుకోవద్దు. వైకాపా మళ్లీ అధికారంలోకి రాగానే 35 ఏళ్ల నిబంధన సడలిస్తాం’ అంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అధికారంలోకి రాకపోతే వారి పరిస్థితి ఏంటన్నది చెప్పకుండా దాటవేశారు. వాలంటీర్లు రాజీనామా చేయకుండా పార్టీ కోసం పనిచేస్తే ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్‌ చేస్తే, మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవడం కష్టంగా మారుతుందన్న ఉద్దేశంతోనే రాజీనామా చేయమని తాము చెబుతున్నట్లు నమ్మబలికారు. రాజీనామా చేసిన కాలానికి వారు ఆర్థికంగా నష్టపోతున్న మొత్తాన్ని పురస్కారాల రూపంలో భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img