icon icon icon
icon icon icon

జే’ గ్యాంగ్‌ దోపిడీతో తగ్గిన పన్నుల రాబడిని పెంచుతాం

సలహాదారుల పేరుతో ప్రజల సొమ్మును వైకాపా ప్రభుత్వం దుబారా చేసిందని.. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారిని తొలగిస్తామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.

Published : 02 May 2024 05:51 IST

సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి హామీలు అమలు చేస్తాం
తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోపై యనమల స్పష్టీకరణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సలహాదారుల పేరుతో ప్రజల సొమ్మును వైకాపా ప్రభుత్వం దుబారా చేసిందని.. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారిని తొలగిస్తామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. జే గ్యాంగ్‌ దోపిడీతో తగ్గిన పన్నుల ఆదాయాన్ని, రాష్ట్ర సొంత పన్నుల రాబడి (స్టేట్‌ ఓన్‌ రెవెన్యూ)ని పెంచుతామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పన్నుల విధానంలో ఉన్న పలు సంస్కరణల్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచవచ్చని చెప్పారు. సంపద సృష్టించడం, ఆదాయాన్ని పెంచడం ద్వారా తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అన్ని హామీల్నీ అమలు చేస్తామని తెలిపారు. జూమ్‌ ద్వారా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని ఎలా అమలు చేస్తారంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సహజ వనరుల్ని సక్రమంగా వినియోగించుకుంటే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రావాల్సిన 41 శాతం గ్రాంటును 40 శాతానికి తగ్గించింది. దీంతో రూ.1,500 కోట్ల మేర కోత పడింది. దీనిపై 16వ ఆర్థిక సంఘంతో చర్చించి గ్రాంటును 50 శాతానికి పెంచేలా కృషి చేస్తాం. వైకాపా ప్రభుత్వంలో మద్యం, గనులు, వివిధ సహజ వనరుల దోపిడీ ద్వారా పక్కదారి పడుతున్న ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు మళ్లిస్తే రాష్ట్ర ఆదాయం కచ్చితంగా పెరుగుతుంది. ఆగ్రో ప్రాసెస్‌, హార్టీకల్చర్‌, ఆక్వా కల్చర్‌, లైవ్‌స్టాక్‌ రంగాలను తిరిగి గాడిలో పెడతాం. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్ని పునరుద్ధరిస్తాం. తద్వారా సేవారంగం పురోగమిస్తుంది. ఉద్యోగాలు వస్తాయి, పేదల ఆదాయం పెరుగుతుంది’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img