icon icon icon
icon icon icon

ఇతరులకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తు మార్పు

హైకోర్టుకు ఎన్నికల సంఘం నివేదించిన నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలువురు స్వతంత్ర, ఇతర పార్టీల అభ్యర్థులకు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును జిల్లాల ఎన్నికల అధికారులు వెనక్కు తీసుకున్నారు.

Published : 02 May 2024 06:10 IST

ఈనాడు, కాకినాడ: హైకోర్టుకు ఎన్నికల సంఘం నివేదించిన నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలువురు స్వతంత్ర, ఇతర పార్టీల అభ్యర్థులకు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును జిల్లాల ఎన్నికల అధికారులు వెనక్కు తీసుకున్నారు. కాకినాడ జిల్లాలోని కాకినాడ సిటీ నియోజకవర్గంలో తెలుగు జనతా పార్టీ.. తుని, ప్రత్తిపాడులలో దళిత బహుజన పార్టీ.. పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును రద్దు చేశారు. వారికి ప్రత్యామ్నాయంగా వేరే గుర్తులను బుధవారం కేటాయించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ (సెక్యులర్‌) అభ్యర్థికి కేటాయించిన గాజుగ్లాసు గుర్తును మార్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img