icon icon icon
icon icon icon

గాజు గ్లాసు గుర్తుపై ఈసీ నిర్ణయంతో తెదేపా, భాజపాలకు నష్టం

రాష్ట్రంలో జనసేన పోటీలో లేని చోట్ల గాజు గ్లాసు గుర్తుని స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించాలన్న ఈసీ నిర్ణయం ఆ పార్టీ సానుభూతిపరులు, మద్దతుదారుల్లో గందరగోళానికి దారితీస్తోంది.

Published : 02 May 2024 06:11 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో జనసేన పోటీలో లేని చోట్ల గాజు గ్లాసు గుర్తుని స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించాలన్న ఈసీ నిర్ణయం ఆ పార్టీ సానుభూతిపరులు, మద్దతుదారుల్లో గందరగోళానికి దారితీస్తోంది. కొందరు పొరపాటున గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేసే అవకాశం ఉంది. అది పొత్తులో భాగంగా అక్కడ పోటీలో ఉన్న తెదేపా లేదా భాజపా పార్టీల అభ్యర్థులకు నష్టం కలగజేస్తుంది. అందుకే గాజు గ్లాసు గుర్తుని మరే పార్టీకీ కేటాయించవద్దని జనసేన హైకోర్టుకి వెళ్లింది. జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాలు ఏయే లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయో.. ఆయా లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు, అలాగే జనసేన లోక్‌సభకు పోటీ చేస్తున్న చోట... ఆ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏ అసెంబ్లీ స్థానంలోనూ మరెవరికీ గాజు గ్లాసు గుర్తును కేటాయించబోమని ఈసీ బుధవారం హైకోర్టుకు తెలియజేసింది. రాష్ట్రంలో జనసేన రెండు లోక్‌సభ స్థానాలకు, 21 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పోటీ చేస్తోంది. మిగతా చోట్ల గాజు గ్లాసు గుర్తు ఉంటే జనసేన సానుభూతిపరుల ఓట్లు కొంత మేర దానికి పడే అవకాశముందని, అది తెదేపా, భాజపా అభ్యర్థులకు నష్టమేనన్న ఆందోళన ఆ పార్టీల్లో వ్యక్తమవుతోంది. ఈసీ కోర్టుకు వెల్లడించిన నిర్ణయాన్నే రాష్ట్రమంతా ఎందుకు వర్తింపజేయకూడదు? గాజు గ్లాసు గుర్తుని జనసేన పోటీలో లేని చోట్ల మరెవరికీ కేటాయించకుండా ఉంటే, ఈ గందరగోళం తలెత్తదు కదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img