icon icon icon
icon icon icon

బీసీవైపీ అధ్యక్షుడిపై బలవంతపు చర్యలొద్దు

భారత చైౖతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌పై నమోదు చేసిన హత్యాయత్నం కేసులో ఆయనపై బలవంతపు చర్యలొద్దని చిత్తూరు జిల్లా సదుం పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

Published : 03 May 2024 05:35 IST

పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: భారత చైౖతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌పై నమోదు చేసిన హత్యాయత్నం కేసులో ఆయనపై బలవంతపు చర్యలొద్దని చిత్తూరు జిల్లా సదుం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రచారానికి ఆటంకం కల్పించొద్దని స్పష్టం చేసింది. పోలీసు విధులకు అవరోధం కల్పించారని పేర్కొంటూ రామచంద్రయాదవ్‌పై సదుం పోలీసులు నమోదు చేసిన మరో కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌, న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతో పిటిషనర్‌పై తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img