icon icon icon
icon icon icon

ప్రజల ఆస్తులు లాక్కొనేందుకు జగన్‌ కుట్ర

భూ యాజమాన్య హక్కు చట్టం పేరిట ప్రజల ఆస్తులను లాక్కొనేందుకు జగన్‌ కుట్ర చేస్తున్నారని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు విమర్శించారు.

Published : 05 May 2024 06:42 IST

అరాచకాలకు కేంద్ర బిందువు భూ హక్కు చట్టం
ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు

ఈనాడు డిజిటల్‌, భీమవరం, కాళ్ల, న్యూస్‌టుడే: భూ యాజమాన్య హక్కు చట్టం పేరిట ప్రజల ఆస్తులను లాక్కొనేందుకు జగన్‌ కుట్ర చేస్తున్నారని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన ‘రచ్చబండ’లో సినీనటుడు, జనసేన నాయకుడు పృథ్వీతో కలిసి ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వానికి అప్పు పుట్టకపోవడంతో మనకు తెలియకుండానే మన ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. భూ యాజమాన్య హక్కు చట్టం అమలులోకి వస్తే ఎవరికీ వారి భూములపై హక్కులుండవు. సామాన్యులు, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ చట్టాన్ని అమలు చేసే టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులుగా వారి చెప్పుచేతల్లో ఉండే వారినే నియమిస్తారు. ఇప్పటికే పట్టాలపై, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై, చివరకు సరిహద్దు రాళ్లపై కూడా జగన్‌ బొమ్మలు ముద్రించారు. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే పుట్టిన బిడ్డకు జగనన్న పచ్చబొట్టు, సమాధులపైన జగనన్న ఫొటో వేయాలని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని రఘురామ విమర్శించారు. ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజును పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా.. ఎన్టీఆర్‌, కలిదిండి అబ్బయ్య ఫొటోలతో ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్‌ పాలనపై పృథ్వీ పలు విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img