icon icon icon
icon icon icon

తారువ దాడి ఘటనపై ఈసీకి సీఎం రమేశ్‌ ఫిర్యాదు

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలో తనతో పాటు, భాజపా కార్యకర్తలపై జరిగిన వైకాపా మూక దాడిపై భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) ఆదివారం ఫిర్యాదు చేశారు.

Published : 06 May 2024 05:41 IST

డీజీపీ అసమర్థతే కారణమని లేఖ

ఈనాడు, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలో తనతో పాటు, భాజపా కార్యకర్తలపై జరిగిన వైకాపా మూక దాడిపై భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) ఆదివారం ఫిర్యాదు చేశారు. ‘పోలీసులు నిర్లక్ష్యం, ఏకపక్ష ధోరణి కారణంగానే విపక్షాలపై దాడులు జరుగుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడి ఊరిలో మాపై జరిగిన దాడికి పోలీసులే కారణం. వారిపై చర్యలు తీసుకోవాలి. దీనంతటికీ కారణమైన రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథరెడ్డిని మార్చాలి’ అని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు ఆయన లేఖ రాశారు. ‘ప్రచారానికి వెళ్లిన మా కార్యకర్తలను గాయపరిచారని పరామర్శించడానికి వెళితే నన్ను రెండు గంటల పాటు ఊరిలోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులకు ముందుగా చెప్పి వెళ్లినా ఏమాత్రం రక్షణ చర్యలు చేపట్టలేదు. మాపై భౌతిక దాడికి పాల్పడ్డారు. మా కార్లు ధ్వంసం చేశారు. తారువ నుంచి ప్రాణాలతో బయటపడతామనుకోలేదు. ఎస్పీ మురళీకృష్ణ, డీఎస్పీ అప్పలనాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారిపై చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img