icon icon icon
icon icon icon

తాడిపత్రిలో ఓటర్లకు వైకాపా ప్రలోభాలు

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వైకాపా నాయకులు అనంతపురం జిల్లా తాడిపత్రిలో డబ్బుల పంపిణీకి స్లిప్పులను ఇస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఒక్కో ఓటరుకు రూ.2 వేలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు.

Updated : 07 May 2024 07:11 IST

ఇంటింటికీ స్లిప్పులు పంచుతున్న వైకాపా నాయకులు

తాడిపత్రి, న్యూస్‌టుడే: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వైకాపా నాయకులు అనంతపురం జిల్లా తాడిపత్రిలో డబ్బుల పంపిణీకి స్లిప్పులను ఇస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఒక్కో ఓటరుకు రూ.2 వేలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. ఒక కుటుంబంలో 4 ఓట్లు ఉంటే స్లిప్పుపై ‘8’ అని రాసి ఇస్తున్నారు. ఈ స్లిప్పులను జాగ్రత్తగా దాచుకోవాలని కొంతమంది రహస్యంగా వచ్చి స్లిప్పుల్లో ఉన్నదాని ప్రకారం డబ్బులిచ్చి వెళతారని చెబుతున్నారు. మెయిన్‌ బజార్‌, బంకమడి వీధి, జయనగర్‌ కాలనీ, శ్రీరాములపేట, అంబేడ్కర్‌నగర్‌, సీపీఐ కాలనీ, టైలర్స్‌ కాలనీ, విజయనగర్‌ కాలనీల్లో సోమవారం ఇంటింటా తిరుగుతూ స్లిప్పులిచ్చారు. వైకాపా ప్రజాప్రతినిధి అనుచరులు యల్లనూరు, పుట్లూరు నుంచి వచ్చి తాడిపత్రిలో డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఉద్యోగులకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వైకాపా నాయకులు పంచారు. డబ్బులు తీసుకున్న ఉద్యోగుల ఇళ్ల వద్దకు సోమవారం వెళ్లి ఎవరికి ఓటేశారంటూ ఆరా తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img