icon icon icon
icon icon icon

మంత్రి జోగి రమేశ్‌ కుమారుడు, వైకాపా నేతలపై కేసు

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాకలో దళితులపై వైకాపా నేతల దాడి ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పందించింది. ఈ దాడిపై ‘ఈనాడు’లో వెలువడిన కథనాన్ని రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులకు సోమవారం ఆదేశాలు జారీ అయ్యాయి.

Published : 07 May 2024 04:54 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాకలో దళితులపై వైకాపా నేతల దాడి ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పందించింది. ఈ దాడిపై ‘ఈనాడు’లో వెలువడిన కథనాన్ని రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులకు సోమవారం ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పెనమలూరు పోలీసులు మంత్రి జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. పెదపులిపాకకు చెందిన పులిపాక సుదర్శన్‌ ఆదివారం రాత్రి తన ఇంటికి సమీపంలో పలువురితో కలిసి నిల్చున్నారు. ఆ సమయంలో జోగి రాజీవ్‌, వైకాపా కార్యకర్తలతో కలిసి ఎస్సీ వాడలో ప్రచారానికి వచ్చారు. సుదర్శన్‌, మరికొందరు తమ గురించే మాట్లాడుకుంటున్నారని వైకాపా కార్యకర్తలు వారిని కులం పేరుతో దూషిస్తూ, కొట్టి వెళ్లిపోయారు. ఈ మేరకు మంత్రి కుమారుడు జోగి రాజీవ్‌, పెదపులిపాకకు చెందిన వైకాపా కార్యకర్తలు రబ్బాని, మాబు సుభాని, ఫరీద్‌ బాషా, సుభాని, మరో ముగ్గురిపై కుల దూషణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img